న్యూఢిల్లీ:  తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీలో చేరితే తమపై విషం కక్కుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక ప్రజలు కోరుకుంటున్న బీజేపీలో ఉండాలని వారు పార్టీలో చేరారని స్పష్టం చేశారు. 

ఇకపోతే ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అంతేకాదు టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

టీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ ఏనాడు చట్ట సభల నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని ఆయన తెలిపారు. తప్పు అంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని మీడియాముందు బీజేపీపై పడి ఏడవడం ఎందుకు అంటూ నిలదీశారు విష్ణువర్థన్ రెడ్డి.