Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి

 లోక్‌సభ డిప్యూటీ స్పీకర్  పదవిని వైఎస్ఆర్‌సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.
 

bjp offers to ysrcp deputy speaker post in lok sabha
Author
Amaravathi, First Published Jun 11, 2019, 4:45 PM IST


అమరావతి: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్  పదవిని వైఎస్ఆర్‌సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించారు. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా  పనిచేశారు. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ దక్కించుకొంది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది.

వైఎస్ఆర్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనుకొంటున్నట్టుగా బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్‌సీపీకి సమాచారం పంపింది. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలా... వద్దా అనే కోణంలో వైఎస్ఆర్‌సీపీ ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ పదవిని తీసుకొంటే  గిరిజనులకు ఈ పదవిని కట్టబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios