విజయవాడ: కేంద్రంలో బీజేపీది చారిత్రాత్మక విజయమని  ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇంతటి ఘనవిజయం దేశ చరిత్రలో ఏ పార్టీకి రాలేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతమని కొనియాడారు. 

శనివారం పంజా సెంట్లరో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకు వస్తున్నారని తెలిపారు. లింగబేధం లేకుండా సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందేలా మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. 

ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై  కీలక వ్యాఖ్యలు చేశారు పురంధీశ్వరి. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని చంద్రబాబు నాయుడే అంగీకరించారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది కలలు కన్నారని, కానీ ఓటర్లు వారి కలలపై నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. 

ఏపీకి బీజేపీ ఎంతో సహాయం చేసినా చంద్రబాబు తన సొంత మీడియా ద్వారా ఏమీ చేయలేదని ప్రచారం చేయించారని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్‌ అని చెబుతారు కానీ బీజేపీలో మోదీ తర్వాత ఎవరూ ఉండరు అని అన్నారు.  

ఈ సందర్భంగా పలువురు మైనారిటీ నేతలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు పురంధీశ్వరి. నాయకులు, ప్రజలు కులమతాలకు అతీతంగా బీజేపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు మాజీమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.  


సామాజికంగా, ఆర్థికంగా దేశ ప్రజల అభివృద్ధికి తోడ్పడే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పుకొచ్చారు. గరీబ్ హటావో నినాదం ఆరోజులలో ఇందిరాగాంధీ ఇచ్చారు. అంత్యోదయ  సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపి ప్రభుత్వం పనిచేస్తోందని కన్నా తెలిపారు. 


కష్టపడి  పనిచేస్తే ఎంతెత్తుకైనా ఎదగవచ్చుని నిరూపించింది ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు. దేశంలో పేదరిక నిర్ములన కోసం 130 కార్యక్రమాలు మోడి ఏర్పాటు చేశారని తెలిపారు. 
బీజేపీ పై దుష్ప్రచారం చేసి‌ లబ్ధిపోందామని చూసిన తెలుగుదేశం వంటి పార్టీలను ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు కన్నా లక్ష్మీనారాయణ.