ఏపీలో హిందూ ఆలయాల పైన దాడులు పెరిగిపోయాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన..  ఆకతాయిల పనిగా ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు.

రామతీర్థంలో రాముని తల తొలగిస్తే... అన్ని వర్గాలు ఆవేదన చెందాయని, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవీఎల్ ఆరోపించారు. వైసిపి, టిడిపి నాయకులకు లేని ఆంక్షలు మా పైనే ఎందుకని ఆయన ప్రశ్నించారు.

రామతీర్థం వెళ్లాలంటే... తమకు ఎందుకు అనుమతి ఇవ్వరని నరసింహారావు నిలదీశారు. బిజెపి కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.

నిన్న రామతీర్థం లో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని.. కిషన్ రెడ్డి కూడా... సోము వీర్రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని జీవీఎల్ తెలిపారు. అమిత్ షా కు కూడా వినతి పత్రం ద్వారా పరిస్థితి వివరిస్తామని ఆయన చెప్పారు.

మొన్న మాకు అనుమతిస్తామని చెప్పిన ప్రభుత్వం.. నిన్న ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని.. వైసిపి ప్రభుత్వం అకృత్యాలు ను ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్ హెచ్చరించారు.

మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలును మోసం చేస్తున్నారని.. ఎపిలో హిందూ మతం పై దాడి జరుగుతుంటే అన్ని‌మతాలతో కమిటీలు ఎందుకని నరసింహారావు ప్రశ్నించారు.

ఇతర  మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరన్న ఆయన.. ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం పై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.

కమిటీలులో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారని.. కానీ ఎపిలో తొంభై ‌శాతం హిందువులు ఉన్నారని నరసింహారావు స్పష్టం చేశారు. హిందూ మతంపై దాడి చేస్తే...‌ ఇతర మతస్తులు కమిటీలులో ఉండి ఏం‌ చేస్తారని ప్రశ్నించారు.

మతంపై మరో మతం వారు దాడి చేయడం లేదని.. అందరూ అన్మ దమ్ముల్లా కలిసి ఉన్నారని వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని నరసింహారావు హితవు పలికారు. ఇప్పటి‌వరకు దాడుల ఘటనల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న ఆయన.. వారెవరు.. ఏ సెక్షన్లు పెట్టారో.. ప్రభుత్వం ఎందుకు చెప్పదని నిలదీశారు.

వైసిపి రాజకీయ భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని జీవీఎల్ సూచించారు. హిందూ పెద్దలు ఎందరో ఈ దాడులను ఖండించారని ఇతర మతాలపై దాడి వద్దని చెప్పారని ఆయన గుర్తుచేశారు.

అదే విధంగా ఆయా మత పెద్దలు కుడా తమ వారికి ప్రకటనలు చేయాలని.. టిడిపి‌ వారే ఈ. దాడులు చేయిస్తే వారిని అరెస్టు చేయాలని నరసింహారావు డిమాండ్ చేశారు.

వైసిపి, టిడిపి ల మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉందా, బయట తిట్టుకుంటూ.. అంతర్గతంగా కలిసి పని‌చేస్తున్నారా అంటూ ఆయన ఆరోపించారు. హిందూ వ్యతిరేక రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ది చెబుతామని నరసింహారావు హెచ్చరించారు.