బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి చౌడేశ్వరి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌడేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. జీవీఎల్ నరసింహారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామం.