ఎంపీ సీఎం రమేష్ కు కరోనా

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు.

BJP MP CM Ramesh tests COVID Positive

కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. నానాటికి దాని ప్రాభవం విస్తృతమవుతుంది. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులతో సహా అందరూ కరోనా వైరస్ బారినపడ్డ విషయం మనకు తెలిసిందే. 

 తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఆయనే ఈ విషయాన్నీ స్వయంగా ధృవీకరించారు. 

తనకు అనారోగ్య సమస్యలు ఏమీ లేవని, తాను ఆరోగ్యంగా ఉన్నానని, డాక్టర్ల సూచన మేరకు ఐసొలేషన్ లో ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా చెప్పారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఇకపోతే... దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే  62,538 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20,27,075కి చేరుకొంది.

దేశంలో  యాక్టివ్ కేసులు 6,07,384 ఉన్నాయి. మరో వైపు కరోనా సోకిన వారిలో 13,78,106 మంది రికవరీయ్యారు.కరోనాతో 41,585 మంది ఇప్పటివరకు మరణించారు.
దేశంలో ఈ ఏడాది జూలై 31వ తేదీన అత్యధికంగా 57,151 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత నిన్న నమోదైన కేసులే అత్యధికం. నిన్న ఒక్క రోజే 50 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు.

గత 9 రోజుల వ్యవధిలో దేశంలో కొత్తగా ఐదు లక్షల కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21 రోజుల సమయం పడుతోంది.
దేశంలో గత 24 గంటల వ్యవధిలో 886 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో మరణించిన వారి సంఖ్య 2.07గా నమోదైంది.

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనాతో మరణించే వారి సంఖ్య కూడ పెరిగిపోతోంది. మహారాష్ట్రలో  నిన్న ఒక్క రోజే 300 మంది మరణించారు. అంతేకాదు కొత్తగా 11,500 కేసులు రికార్డయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios