రాజమహేంద్రవరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాజకీయ దళారీ, రాజకీయ వ్యభిచారి అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తో జతకట్టాక ఏపీలో టీడీపీ పని అయిపోయినట్లేనని చెప్పారు. 

దివంగత సీఎం ఎన్టీఆర్ ఆశయాలకు సిద్ధాంతాలకు తూట్లుపొడిచేలా కాంగ్రెస్‌తో జతకడుతున్న చంద్రబాబుపై ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు తిరుగుబాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అన్న చంద్రబాబు మరి ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ఏమైందని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 30 సీట్లకు మించి రావని సోము వీర్రాజు జోస్యం చెప్పారు.