అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై మిశ్రమంగా స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే పీవీఎన్ మాధవ్. ఖర్చులకు తగ్గ లెక్కలు ఉన్నాయి కానీ ఆదాయం పెంచుకునే మార్గాలు లేవు అంటూ పెదవి విరిచారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన మాధవ్ బడ్జెట్ నవరత్నాల బడ్జెట్ అని క్లియర్ గా చెప్పొచ్చు అని అభిప్రాయపడ్డారు. క్రీడల శాఖకు 70 శాతం కోతలు విధించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

విభజన చట్టంలోని హామీల గురించి కూడా ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రస్తావన కనిపించలేదని విమర్శించారు. 
ఖర్చులకు తగ్గ లెక్కలు ఉన్నా ఆదాయం పెంచుకునే మార్గాలు మాత్రం కనిపించడం లేదన్నారు. 

మైనింగ్ కు సంబందించిన ఆదాయం కూడా రాష్ట్రానికి తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరులు పట్ల దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలుగు భాష పట్ల ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక శాఖకు కూడా నిధులు తగ్గించారని  విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.