విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారని అందువల్లే రాహుల్ గాంధీని కలిశారని తెలిపారు.

రాహుల్ గాంధీ, చంద్రబాబుల భేటీ కేవలం కూటమి ఏర్పడబోతుందని సంకేతాలివ్వడానికేనని చెప్పుకొచ్చారు. పొత్తుపెట్టుకోవడం ఫలించకపోతే ఆ పార్టీలకు నామం పెట్టడం చంద్రబాబుకు అలావాటేనని విమర్శించారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నామం పెడతారని స్పష్టం చేశారు. 

త్వరలోనే కాంగ్రెస్ తో కలిసి చారిత్రక తప్పిదం చేశామని చంద్రబాబు అంటారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు నాయుడ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని విమర్శించారు. అంతే తప్ప అందులో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.