బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ శాసనసభ్యుడు జోగి రమేశ్.. తన పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామపై నిప్పులు చెరగడం, సీఎం జగన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం తెలిసిందే

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ శాసనసభ్యుడు జోగి రమేశ్.. తన పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామపై నిప్పులు చెరగడం, సీఎం జగన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం తెలిసిందే.

దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ... ఈసారి జరిగే ఏపీ కేబినెట్ విస్తరణలో జోగి రమేశ్‌కు పదవి ఖాయం అని జోస్యం చెప్పారు. తిట్టినోళ్లకు పదవులు అని, అసెంబ్లీలో రఘురామను జోగి రమేశ్ బూతులు తిడితే సీఎం థ్యాంక్స్ చెప్పారని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు

Also Read:రఘురామపై థర్డ్ డిగ్రీ... ఆర్మీ డాక్టర్ల నివేదికలో ఏముందంటే?: ఎమ్మెల్సీ మంతెన

ఇక, కస్టడీలో రఘురామను కొట్టినవారికి కూడా పదోన్నతులు లభిస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఒకవేళ రఘురామ జైలుకు వెళ్లుంటే మాత్రం అనుమానాస్పద స్థితిలో మరణించేవారని భావిస్తున్నామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ అంటే తనకు గౌరవం అని, లేదంటే తనను కూడా లోపలేస్తారని విష్ణుకుమార్ రాజు చమత్కరించారు. రఘురామ ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు