ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతి రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతి రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. చలపతి రావు కుమారుడు పీవీఎన్ మాధవ్.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చలపతిరావు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. చలపతిరావు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పీవీ చలపతిరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. చలపతిరావు మృతి పట్ల బీజేపీ ఏపీ శాఖ సంతాపం తెలిపింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొంది. పీవీ చలపతి మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తమకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు.
