స్వంత పార్టీపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు  గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎేన్నికల్లో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కారణంగా  మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

అమరావతి: స్వంత పార్టీపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎేన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం ప్రచారం చేయడం, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు.వన్‌షాట్ టూ బర్డ్స్‌ అంటూ ఓ సామెతను ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లో వన్ షాట్ త్రీ బర్డ్స్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం దెబ్బకు తెలంగాణలో టీడీపీ కోలుకోలేని దెబ్బతిందన్నారు. ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తే ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు దక్కేవన్నారు.

మరోవైపు టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడ కోలుకోలేని దెబ్బతిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ కూడ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లు కూడ టీఆర్ఎస్‌కు ఓటేశారని ఆయన చెప్పారు.ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకొంటే ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.ఏ పార్టీలో చేరుతాననేది ఇప్పుడే చెప్పలేనని ఆయన చెప్పారు.