Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం ! ఎనిమిది పక్షులు మృత్యువాత !!

ప్రకాశం జిల్లా పెదగంజాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. సోమవారం నాడు ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. 

Bird flu tension in prakasam district, 8 birds dead - bsb
Author
Hyderabad, First Published Jan 12, 2021, 2:24 PM IST

ప్రకాశం జిల్లా పెదగంజాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. సోమవారం నాడు ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. 

ఈ విషయం గ్రామస్తులకు పొక్కడంతో బర్డ్‌ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. 

అయితే ఈ విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్‌ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్‌ బసవశంకర్ తెలిపారు. తాము వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారని కాబట్టి అపోహలు నమ్మొద్దని, ఆందోళన పడొద్దని అన్నారు. 

అంతేకాదు గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్‌ రేటరీలున్నాయి. బర్డ్‌ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్‌లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

బర్డ్‌ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్‌ను ఉడికిస్తారు  చికెన్‌ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios