రేవంత్ విషయంలో ఇంత హడావిడి చేస్తున్న అధికారులకు.. చంద్రబాబు ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు. రేవంత్‌పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, అతని బంధవుల ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉంది కాబట్టే.. రేవంత్ ని అధికారులు టార్గెట్ చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఈ ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన చంద్రబాబుని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ విషయంలో ఇంత హడావిడి చేస్తున్న అధికారులకు.. చంద్రబాబు ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు. రేవంత్‌పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు.
రేవంత్‌పై ఐటీ అధికారుల దాడులపై హడావుడి చేస్తున్న ఎల్లో మీడియా.. చంద్రబాబుపై మౌనం వహించడానికి కారణాంలేటని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మతలబు ఏమిటని ప్రశ్నించారు. నేరగాడైన మఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టానికి అతీతుడా అని ధ్వజమెత్తారు. అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.