ఆయన చంద్రబాబు నాయుడు కాదు.. ‘ఎర్ర’ నాయుడు: భూమన

First Published 31, Aug 2018, 6:11 PM IST
bhumana karunakar reddy comments on chandrababu naidu
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ పాలనలో స్మగ్లర్లు పెరిగిపోతున్నారని.. ఎర్రచందనం సంపద తరిగిపోతోందని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ పాలనలో స్మగ్లర్లు పెరిగిపోతున్నారని.. ఎర్రచందనం సంపద తరిగిపోతోందని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.. నాలుగున్నరేళ్లుగా కోట్ల విలువైన అటవీ సంపదను పచ్చదండు దోచుకుంటోందని ఆయన విమర్శించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన చంద్రబాబు అసలు ఎర్రచందనం అనేది లేకుండా దోచేస్తున్నారని ఆరోపించారు. నటనలో నందమూరిని, నాటకాల్లో నాగభూషణాన్ని, కథలు చెప్పడంలో పిట్టల దొరని చంద్రబాబు మించిపోయారని వ్యాఖ్యానించారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. ‘ ఎర్రనాయుడు’ని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పచ్చచొక్కాలకు ఇంధనం ఎర్రచందనమేనని వ్యాఖ్యానించారు.

ఎర్రచందనం నాణ్యతను తగ్గించి చూపి.. మేలురకం దుంగలను విదేశాలకు తరలించి కోట్లు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎర్రచందనాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బూటకమని.. వారికి తప్పుపట్టిన తుపాకులు ఇచ్చారని.. ఇలాంటి వాటి వల్ల కూంబింగ్ నిర్వహించడం అటవీ సిబ్బందికి ఎలా సాధ్యమవుతుందని భూమన ప్రశ్నించారు.

loader