ఆదోని: కర్నూల్ జిల్లా ఆదోనిలో రియల్టర్ బసవరాజును గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా చేసేందుకు గాను మృతదేహాన్ని దగ్దం చేశారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం నుండి బసవరాజు ఆచూకీ లేకుండా పోయింది.  ఆదోనికి సమీపంలోని ఆసుపత్రిలో రియల్టర్ బసవరాజు మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. బసవరాజు బైక్‌కు సమీపంలోనే మృతదేహం లభించింది.

బసవరాజును హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు పెట్రోలు పోసి దగ్దం చేశారా... లేదా సజీవంగానే దహనం చేశారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వ్యాపార లావాదేవీల కారణంగా  ఈ ఘటన చోటు చేసుకొందా... లేక మహిళలకు సంబంధించిన వ్యవహరం ఏమైనా ఈ ఘటనకు కారణమైందా అనే  విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.