అనకాపల్లిలోని నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలు సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో (anakapalle district) ఓ బ్యాంక్‌ను లూటీ చేశారు దొంగలు. పట్టణంలోని నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో (grameena vikas bank) చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
