ఏపీ స్థానిక ఎన్నికలు: చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. ఆ రెండు చోట్ల నామినేషన్ల తిరస్కరణ, కోర్టుకెక్కే ఆలోచన

చిత్తూరు జిల్లాలో (chittoor) టీడీపీకి (tdp) షాక్ తగిలింది. బంగారుపాళ్యం (bangarupalyam) , కలకడ (kalakada) జెడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. 

bangarupalyam kalakada zptc tdp candidates nominations rejected in chittoor district

ఆంధ్రప్రదేశ్‌లో (ap local body elections) మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్స్‌కి గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ వేయకుండా వైసీపీ నేతలు బెదిరించడంతో పాటు దాడులకు దిగుతున్నారని టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో (chittoor) టీడీపీకి (tdp) షాక్ తగిలింది. బంగారుపాళ్యం (bangarupalyam) , కలకడ (kalakada) జెడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పరిశీలన పూర్తయింది. దీంతో ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయలేదని చెబుతూ తెలుగుదేశం (telugu desam party) పార్టీ జెడ్‌పిటిసి అభ్యర్థిగా నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అయితే, రాజకీయ కక్షతోనే అధికారులు నామినేషన్ తిరస్కరించారని తామ కోర్టును ఆశ్రయిస్తామని నామినేషన్ తిరస్కరణకు గురైన టిడిపి అభ్యర్థులు మండిపడ్డారు.

బంగారు పాళ్యం, కలకడ మండలాలకు సంబంధించిన జెడ్పిటిసి ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శుక్రవారం రోజు తమ తమ నామినేషన్లను దాఖలు చేసుకున్నారు. అయితే, నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని అందువల్ల వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్ వీటిలో కాలం సంఖ్య 5(9), సదరు అభ్యర్థి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రంలో రుణం క్లియర్ కాలేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా కలకడ మండలం టిడిపి అభ్యర్థిగా సురేఖ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణలో ఇచ్చిన పుట్టినతేది, ఆధార్ కార్డులో గల తేదీలు వేరు వేరుగా ఉన్నాయని, వయస్సు ధ్రువీకరణకు సంబంధించి ధ్రువీకరణ పత్రం సమర్పించలేదు. డిక్లరేషన్ ఫారంలో దరఖాస్తుకు సాక్షి సంతకం చేసిన వారి అడ్రస్ వ్రాయలేదు. పొదుపు సంఘంలో రెండవ లీడర్‌గా వుంటూ రుణం క్లియర్ చేయలేదని, అందుకు సంబంధించి ప్రత్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Also Read:లైన్‌మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ.. ‘క్రైమ్ సిటీగా విశాఖ’

దీనిపై జిల్లా కలెక్టర్ సమక్షంలో నవంబరు 7వ తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 లోపల అప్పీలు చేసుకోవచ్చునని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే రాజకీయ కక్షలతో అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని నామినేషన్ లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆరోపించారు తాము కోర్టును ఆశ్రయిస్తామని వివరించారు. తప్పుడు సమాచారం అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ  స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది. అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.  పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios