Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎన్జీవో నూతన అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు..

ఏపీ ఎన్జీఓ సంఘ నూతన అధ్యక్షుడు, బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ నూతన ప్రధాన కార్యదర్శి, కె.వి.శివారెడ్డిలు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పదవీ విరమణతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. 

bandi srinivasa rao as AP NGO new president - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 3:17 PM IST

ఏపీ ఎన్జీఓ సంఘ నూతన అధ్యక్షుడు, బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ నూతన ప్రధాన కార్యదర్శి, కె.వి.శివారెడ్డిలు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పదవీ విరమణతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. 

ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో.. మాజీ అధ్యక్షుడు, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ. భారతదేశ స్ధాయిలో ఏపీఎన్జీఓ ల సంఘానికి గుర్తింపు ఉందన్నారు.
కొన్ని సమస్యలు, డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాం అని, ఈనెలలో పెండింగ్ డీఆర్ లు ఇస్తామన్నారని తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు.

అనంతరం ఏపీ ఎన్జీఓ సంఘ నూతన అధ్యక్షుడిగా నియమితులైన బండి శ్రీనివాసరావు మాట్లాడారు.  మా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను శిరసా వహిస్తామని తెలిపారు. 27% ఐఆర్ ను పెంచి కొత్త ఏఆర్సీ అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ కూడా ఐఆర్ పెంపుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

మూడు డీఏలను కేంద్రం పెండింగ్ లో పెట్టంది అన్నారు. కొంతమంది అధికారుల జాప్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, పాదయాత్రలో డిమాండ్లపై కమిటీలతో కాలయాపన చేయకుండా పూర్తి చేయాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు లేక డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 

కాటంనేని భాస్కర్ జీఓ 64 అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీన్ని తక్షణమే జీఓ 64 రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.  జీఎస్టీ అధికారులకు అందరికీ గజిటెడ్ స్ధాయి కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఏపీ ఎన్జీఓ నూతన ప్రధాన కార్యదర్శి, కె.వి.శివారెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు తీరాలని సంఘం ఎన్నో పోరాటాలు చేస్తోందన్నారు. డిమాండ్లు సాధించడానికి కచ్చితంగా ఉద్యమిస్తామన్నారు.  సముద్రంలాంటి సంఘంలో నుంచి చిన్న పాయలు పక్కకి పోతే పోయిందేమీ లేదన్నారు. 

కోవిడ్ తీవ్రత తగ్గాక అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఆ పరిస్ధితి రాకుండా ప్రభుత్వం చూస్తుందని ఆశిస్తున్నామన్నారు.  ఐఏఎస్ లు టెక్నికల్ విషయాలు తెలీకుండా జీఓ 64 తెచ్చారని, డిపార్ట్మెంట్ హెచ్ఓడీ లకు మాత్రమే అవగాహన ఉండే సీఆర్ ను వారే ఇచ్చేలా చూడాలన్నారు. 

కోవిడ్ కాలంలో ఎంతో వీరోచితమైన సేవ చేస్తున్న వైద్య ఉద్యోగులు,వైద్యులతో కలిసి ఉద్యమించడానికి ఏపీఎన్జీఓ సిద్ధంగా ఉందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios