ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజలు... తమ పార్టీ ని కాదని.. వైసీపీ ఓట్లు వేసి గెలిపించడం చాలా బాధ కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అభివ‌ృద్ధి చేసినప్పటికీ.. ప్రజలు వైసీపీకి ఓటు వేయడం బాధ కలిగిస్తోందన్నారు. అయినా ఈ ఐదేళ్లలో కార్యకర్తలకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. 

టీడీపీకి కార్యకర్తలే కొండంత బలమని.. దేశంలో ఏ పార్టీకి లేనివిదంగా టీడీపీకి కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు.హిందూపురం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉంటుందని బాలయ్య సతీమణి వసుంధర అన్నారు.