ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. వివరాలు.. నూజివీడు‌కు చెందిన ఓ బాలికకు బెంగళూరు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంజనేయులును కలిసేందుకు బాలిక విజయవాడకు వచ్చింది. అయితే బాలికను చెప్పిన అడ్రస్‌కు తీసుకెళ్తానని నమ్మించి ఆటో‌లో ఎక్కించుకున్న డ్రైవర్.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. 

అయితే బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆటో డ్రైవర్‌పై ఐపీసీలో 363,354, 506 సెక్షన్లతో పాటు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడుని సింగ్ నగర్ కి చెందిన ఆటో డ్రైవర్ గా గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టారు.