కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలెక్టర్  మధ్య జరగిన ఓ ఆసక్తి చర్చ బయటకు వచ్చింది. గత ఎన్నికల్లో భాగంగా కలెక్టర్‌ సర్ఫరాజ్‌తో బండి సంజయ్ మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయపడడంతో కరీంనగర్ రాజకీయాలు ఓక్కసారిగా వెడెక్కాయి.

ఈ ఆడియో టేప్‌లపై గంగుల స్పందించారు. కలెక్టర్‌ సర్ఫరాజ్‌ తనను ఓడించడానికి కుట్రలు చేసరంటూ మంత్రి గంగుల కమాలాకర్ ఆరోపిస్తున్నారు.  తప్పుడు లెక్కలు చూపెట్టి తనను డిస్ క్వాలిపై  చేయడానికి కుట్ర జరిగిందన్నారు.  ఈ ఆడియో టేపుల వ్యవహారం సీఎం దృష్టి వెళ్లిందని తెలిపారు.

ఈ ఆడియో టేప్స్ ను బీజేపీ నేతలే బయటపెట్టారంటూ సంజయ్ కుట్రల మనిషి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ ఆడియో టేప్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఎన్నికల్లో పెట్టే వ్యయం గురించి కలెక్టర్. సంజయ్ మధ్య చర్చ జరగినంటూ ఆ టేపుల్లో ఉంది. అయితే  ఇది ఎంత వరకు  నిజమనేది తెలియాల్సి ఉంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచినా విషయం తెలిసిందే. అధికార తెరాస పార్టీకి ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత చెమటలు పట్టిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారుకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ఆర్టీసీ కార్మికుడు బాబు మృతితో కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చాడు. 

డ్రైవర్ బాబు మాదిరిగా మరో బలిదానం జరుగకుండా ఉండేందుకు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్థానిక ఎంపీ సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బోడిగు శోభ, ఎమ్మార్పిఎఫ్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలు తెలిపారు. ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారంకోసం చర్చలకు పిలిచేవరకు బాబు అంత్యక్రియలు జరపరాదని,ఇలాగే నిరసన తెలియజేస్తూ వుండాలని నిర్ణయించినట్లు తెలిపారు.

  బిజెపి, కాంగ్రెస్, సిపిఐ. సిపిఎం, టిడిపి, సిఐటియూ, ఏఐటీయూసీ, జనసమితి, విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మొదలగు అఖిలపక్షాలకు చెందిన జిల్లా నాయకులతో పాటు థామస్ రెడ్డి, రాజిరెడ్డి మరియు జోనల్, రీజినల్ జేఏసీ నాయకులంతా శుక్రవారం ఉదయం నుండి బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరవధిక ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలోనే బంద్ కూడా కొనసాగుతుందని ప్రకటించారు.  

అంతే కాకుండ  జేఏపీ చలో కరీంనగర్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని 10 డిపోల నుండి కరీంనగర్ కు మొత్తం కార్మికులు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.  మొత్తం రీజియన్ కార్మికులు తెల్లారేసరికి కరీంనగర్ కి రావాలని విజ్ఞప్తి చేశారు.  చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు జరపకుండా నిరవధికంగా ఈ ధర్నా కొనసాగుతుందని... వారితో ఎంపీ సంజయ్, రాష్ట్ర జేఏసి నాయకులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

బంద్ నేపథ్యంలో శుక్రవారం కూడా గాంధీ సంకల్ప యాత్ర రద్దు చేసినట్లు ఎంపీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మరణించినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉమ్మడిగా బంద్ పాటించాలని ఆయా పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు. 

గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రభుత్వం స్పందించే వరకు అంత్యక్రియలు జరపబోమంటూ గురువారం ఉదయం నుంచి పట్టుబట్టిన బాబు కుటుంబ సభ్యులు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహా వివిధ పార్టీలు, సంఘాలు పాలకవర్గాల వైఖరికి నిరసనగా ఆందోళనబాట పట్టారు.