Asianet News TeluguAsianet News Telugu

పట్టాభిపై దాడి: పొలీసుల అదుపులో కొక్కిరిగడ్డ జాన్ బాబు, అతనిపై 180 కేసులు

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు పది పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. పేరు మోసిన రౌడీ షీటర్ కొక్కిరిగడ్డ జాన్ బాబు పోలీసులఅదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Attack on Pattabhi: Rowdy sheeter Kokkiri Jan babu in polce custody
Author
Vijayawada, First Published Feb 3, 2021, 1:10 PM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిపై దాడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రౌడీ షీటర్ కొక్కిరి జాన్ బాబును పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై పోలీసు రికార్డుల్లో రౌడీ షీట్ ఉంది. దాదాపు 180 కేసుల్లో అతను ముద్దాయిగా ఉననట్లు సమాచారం. అతనిపై నగర బహిష్కరణ కూడా విధించారు. 

పట్టాభిపై దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు పది పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ముద్దాయిలను పట్టుకునే పనిలో ఉన్నామని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు  

పట్టాభిపై దాడి పథకం ప్రకారం చేశారని, ముందుగానే ఇంటి వద్ద కాపు కాసి మోటార్ బైక్ మీద వచ్చి దాడి చేసి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఆ దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి.

టీడీపీ నేత పట్టాభిపై మంగళవారం జరిగిన దాడి తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పట్టాభిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రాజకీయంగా ఈ దాడి తీవ్ర వివాదానికి కారణమైంది. నిందితులు తాడేపల్లి, సింగ్ నగర్, పెనమలూరుకు చెందినవారు కావచ్చునని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios