కర్నూల్ లో దారుణం.. మారణాయుధాలతో దాడి చేసి వాలంటీర్ హత్య..
కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి బయటకు వెళ్లిన అతడు.. మరుసటి రోజు విగతజీవిగా ఓ ఆలయం దగ్గర కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.

కర్నూల్ లో దారుణం జరిగింది. ఓ వాలంటీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఘోరంగా హతమార్చారు. దీని కోసం దుండగులు మారణాయుధాలను ఉపయోగించనట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్ నగర్ వాలంటీర్ గా పని చేసే 23 ఏళ్ల హరిబాబు మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాజీవ్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. తండ్రి పదేళ్ల కిందటే చనిపోగా.. తల్లి ఈరమ్మతో కలిసి జీవిస్తున్నాడు.
విషాదం.. మట్టి గోడ కూలి ముగ్గురు మృతి.. హన్మకొండ జిల్లాలో ఘటన
కాగా. హరిబాబు బుధవారం రాత్రి 11 గంటల సమయం వరకు వినాయక మండల దగ్గరే ఉన్నాడు. తరువాత తన ఇంటికి వెళ్లి నిద్రపోయాడు.
అయితే 12 గంటల సమయంలో అతడికి ఓ ఫోన్ వచ్చింది. దీంతో బయటకు వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అయితే తెల్లవారుజామున తల్లి ఈరమ్మ నిద్రలేచింది. ఇంట్లో కుమారుడు లేకపోవడంతో ఆందోళన చెందింది. చుట్టుపక్కల వాళ్లను విచారించింది. అనంతరం చుట్టాలకు సమాచారం అందించింది. వీరంతా కలిసి హరిబాబు కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మారెమ్మవ్వ ఆలయ సమీపంలో రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. ఈ విషయం తెలియడంతో తల్లి అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యింది.
‘సింగం’వంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
దీనిపై సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని పరిశీలించారు. హరిబాబు తలపై మారణాయుధాలతో దాడి జరిగిందని, అందుకే చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలో పడి ఉన్న హరిబాబు సెల్ ఫోన్, ఇతర ఆనవాళ్లను సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. దీనిపై తల్లి, బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.