గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని బాహుబలితో, 151మంది వైసిపి ఎమ్మెల్యేలను కాలకేయులతో పోల్చారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఈ కాలకేయులకు బాహుబలి అచ్చెన్నను ఎదుర్కొనే దమ్ములేదన్నారు. అందుకోసమే ఇలా అక్రమ అరెస్టులు చేయించారంటూ వెంకన్న ఆరోపించారు. 

''151 మంది కాల‌కేయులు.. ఆజాను బాహుబ‌లి అచ్చెన్నాయుడిని చూసి భ‌యంతో పారిపోతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌లో అచ్చెన్న‌ని ఎదుర్కొనే ద‌మ్ములేక అక్ర‌మంగా అరెస్టు చేశారు'' అంటూ వెంకన్న ట్వీట్ చేశారు. 

read more  అచ్చెన్నాయుడికి వైసిపి ప్రలోభాలు... లొంగలేదు కాబట్టే అరెస్ట్: దూళిపాళ్ల
 
''లక్ష కోట్ల స్కామ్ లో అడ్డంగా బుక్కైనప్పుడు సీబీఐ ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని గుడ్డలు చించుకున్నారు వైఎస్ జగన్. అదే సంస్థ ఇప్పుడు నెయ్యి, మజ్జిగపై విచారణ చెయ్యాలట?'' అని మండిపడ్డారు. 

''అంటే సీబీఐ విచారణ మంచిది అని ఒప్పుకున్నట్టేగా? మరి అదే సంస్థ తమరు 43 వేల కోట్లు కొట్టేసారు అని చెప్పింది. నైతిక బాధ్యత వహించి జగన్ గారు,  మీరు కోర్టులో లొంగిపోయి చేసిన తప్పులకు శిక్ష అనుభవించండి విజయసాయి రెడ్డి గారు'' అని బుద్దా వెంకన్న సూచించారు.