Asianet News TeluguAsianet News Telugu

తెలుగు జాతికి ఇచ్చిన వారెంట్‌గా భావిస్తున్నా: మంత్రి అచ్చెన్నాయుడు

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చెయ్యడంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కుట్రతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. 

ATCHANNAIDU REACTS ON WARRANT
Author
Srikakulam, First Published Sep 14, 2018, 8:03 PM IST

శ్రీకాకుళం జిల్లా: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చెయ్యడంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కుట్రతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. 

బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రైతుల పక్షాన పోరాడారన్నారు. 2007లో దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో తాను కూడా బాబ్లీ వెళ్లానన్న  అచ్చెన్నాయుడు నాకెందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమని తప్పించి చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. 

ఈనెల 23న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లనున్న చంద్రబాబును అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదన్నారు. ఎవరు ఎటువంటి కుట్రలు పన్నినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios