Asianet News TeluguAsianet News Telugu

జగన్ తండ్రి పాలన తెస్తారా...మీకో దండం అంటున్న మాజీ కేంద్రమంత్రి

రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే పోటీ చెయ్యాలని ఉందని కేంద్ర మాజీమంత్రి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచెయ్యాలా...ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

Ashok gajapathi raju wants to participate next election an mp
Author
Vizianagaram, First Published Sep 17, 2018, 3:22 PM IST

అమరావతి: రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే పోటీ చెయ్యాలని ఉందని కేంద్ర మాజీమంత్రి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచెయ్యాలా...ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అశోక్ ధర్మాబాద్ న్యాయస్థానం నోటీసులు వంటి అంశాలపై చర్చించారు.  

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ చారిత్మాత్మక పోరాటం చేసిందని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. బాబ్లీ పోరాటంలో పోలీసులు టీడీపీ నేతలపై దారుణంగా వ్యవహరించారని గుర్తుచేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. తెలంగాణ రైతుల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చెయ్యాలని భావిస్తున్నానని అయితే పార్టీ ఏ టిక్కెట్ ఇస్తే దానికే పోటీ చేస్తానన్నారు. తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తానేమీ చెప్పలేనన్నారు. రాజకీయాలంటే అంత సులభం కాదన్నారు.  జాతీయ పార్టీలు క్రమంగా ప్రజలకు దూరమవుతున్నాయని తెలిపారు. 

మరోవైపు వైసీపీ అధినేత జగన్మోన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన తండ్రి రాజ్యం తెస్తానని అంటున్నారని ఆ రాజ్యం తమకు అవసరం లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పాలన దారుణ పాలన అని అది ఎవరికీ అవసరం లేదన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios