తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధులు ముగించుకుని మరో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది