Asianet News TeluguAsianet News Telugu

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.రిటైరైన ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్ హెడ్ నెంబర్లను కేటాయించింది. ఈ విషయమై ఏపీఎస్ఆర్టీసీ గురువారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జనవరి తర్వాత రిటైరైన ఉద్యోగులతో పాటు ఉద్యోగాల నుండి వైదొలగిన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపునకు మార్గం సుగమం చేసింది.

APSRTC decides to pay retire employees terminal benfits
Author
Guntur, First Published Sep 10, 2021, 10:09 AM IST

అమరావతి: ఏపీఎస్ఆర్‌టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2020 జనవరి తర్వాత రిటైరైన ఉద్యోగులతో పాటు ఉద్యోగాల నుండి వైదొలగిన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపునకు మార్గం సుగమం చేసింది.

రిటైరైన ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్ హెడ్ నెంబర్లను కేటాయించింది. ఈ విషయమై ఏపీఎస్ఆర్టీసీ గురువారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రత్యేక అకౌంట్‌ హెడ్‌ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకూ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నేరుగా లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు.

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను వర్తింపజేసింది. 

ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. కారుణ్య నియామకాల అంశాన్ని పరిశీలిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.  ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios