ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీ పీసీసీ అద్యక్షుడు సాకే శైలజానాథ్ తప్పు పట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తప్పు పట్టారు. అయితే తాము ఏ ఎన్నికల్లోనైనా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తాను తప్పుడుతున్నట్లు ఆయన చెప్పారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాకే శైలజానాథ్ ప్రకటన ఊరట కలిగిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెసు విమర్శిస్తోంది. ఈ స్థితిలో శైలజానాథ్ ప్రకటన కొంత మేరకు వారికి ఉరటనిస్తోంది.
రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీుసకోవాల్సిందని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. తొలగింపు అక్రమమని తాము గతంలో నిమ్మగడ్డకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గతంలో ఇచ్చిన నోటీపికేషన్ ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. జడ్ పిటిసి, ఎంపిటిసీ, మున్సిపాలిటీ లో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయని ఫిర్యాదులు ఇచ్చామని గుర్తు చేస్తూ వాటిని రద్దు చేశారా లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రమేష్ కుమార్ వ్యవహారశైలి సరిగా లేదని ఆయన విమర్శించారు.
రమేష్ కుమార్ తక్షణమే పంచాయితీ నోటిఫికేషన్ రద్దు చేసి స్ధానిక సంస్ధలన్నింటినీ నిర్వహించాలని ఆయన కోరారు.స్ధానిక సంస్ధలను, పంచాయితీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టి అడ్డుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారో తెలియదని, తమతోనైతే మాట్లాడలేదని శైలజానాథ్ అన్నారు.
కరోనాతో ఒక్కరు కూడా చనిపోకూడదని నిమ్మగడ్డ కు గతంలో తాము లేఖ ఇచ్చామని, ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు.
బిజెపి అజెండాను సిఎం జగన్ అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. స్ధానిక సంస్ధల నిర్వహణకు కరోనా అడ్డువస్తే తిరుపతి ఉప ఎన్నికకు అడ్డు రాదా అని అడిగారు.రమేష్ కుమార్ గతంలో మీకు అండగా నిలబడింది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి కాదని అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికలకు భయపడదని చెప్పారు. రమేష్ కుమార్ చిత్తశుద్ధిపై తమకు అనుమానం ఉందని, గతంలో నిర్వహించిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని అడిగామని శైలజానాథ్ అన్నారు.
జగన్ శాసనమండలి ని రద్దు చేస్తామన్నారని,. కాని ప్రతిచోట ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎంపిటిసి, జడ్ పిటిసి, మున్సిపాలిటీ రద్దు చేయమన్నామని, .ఇప్పుడు పంచాయితీలకు మాత్రమే ఏలా నోటిఫికేషన్ ఇస్తారని అన్నారు.
జగన్, నిమ్మగడ్డ వ్యక్తిగత పట్టుదలలకు పోయి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించవద్దని అన్నారు. నిమ్మగడ్డ తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే బాగుుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2021, 3:04 PM IST