ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన పేరుతో ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సృజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పోస్టులపై ఏపీఐఐసీ సీరియస్‌గా స్పందించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన పేరుతో ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సృజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే పరిశ్రమల శాఖ డైరెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫేక్‌పోస్టులతో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఏపీఐఐసీ సీరియస్‌గా స్పందించింది. ఇటువంటి పోస్టులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. నిరాధార పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఏపీఐఐసీ ఫిర్యాదు చేసింది. 

అంతేకాకుండా ఫేక్ జాబ్ పోస్టులపై జాగ్రత్తగా వ్యవహరించాలని నిరుద్యోగులకు సూచించింది. ఏపీఐఐసీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారి చేశారనేది ఫేక్ అని తెలిపింది. అసత్య ప్రచారాలను నిరుద్యోగులను నమ్మొద్దని చెప్పింది. ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఆశ చూపినా, వసూళ్లు చేసినా అప్రమత్తం అవ్వాలని సూచించింది.