Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి కాంగ్రెస్ లోనే, ఎన్నికల ప్రచారంలో ముందుండేది ఆయనే:ఏపీసీసీ చీఫ్ రఘువీరా

మెగాస్టార్ చిరంజీవి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. 

Apcc chief raghuveerareddy clarify on chiranjeevi with congress
Author
Vijayawada, First Published Oct 31, 2018, 3:08 PM IST

విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న రఘువీరారెడ్డి చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉంటారని తెలిపారు. 

ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రచారానికి వస్తానని చిరంజీవి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పారని రఘువీరా తెలిపారు. గత కొంతకాలంగా చిరంజీవి జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ముగిసినా దాన్ని పునరుద్ధరించుకోకపోవడం గమనార్హం.  

ఈ వార్తలు కూడా చదవండి

చిరంజీవి, అల్లు అరవింద్ కి మా పార్టీతో సంబంధం లేదు... జనసేన షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ కి చిరంజీవి రాజీనామా..?

చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

 

Follow Us:
Download App:
  • android
  • ios