మహిళలతో ప్రజా ప్రతినిధుల ఆడియో సంభాషణలు: విచారణ అవసరమన్న వాసిరెడ్డి పద్మ
ఏపీకి చెందిన ఇద్దరు కీలకమైన ప్రజా ప్రతినిధులు మహిళలతో మాట్లాడిన ఆడియో సంభాషణలు ఇటీవల కాలంలో వైరల్ గా మారాయి. ఈ ఘటనలపై విచారణ అవసరమని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు.
అమరావతి:ఏపీ రాష్ట్రంలో ఇద్దరు ప్రజా ప్రతినిదులు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో సంభాషణలపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు.ఆదివారం నాడు ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి చెందిన మంత్రి , ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో సంభాషణలు వైరల్ గా మారాయి.
ఈ విషయమై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు.విచారణ జరిపించాలని పోలీస్ కమిషనర్ ను ఫిర్యాదు చేసినట్టుగా మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. రాజకీయంగా తనను ఇబ్బందిపెట్టేందకు ఈ ఆడియో సంభాషణను లీక్ చేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు మరో ఎమ్మెల్యే ఆడియో సంభాషణ కూడ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ రెండు ఆడియో సంభాషణలపై విచారణ అవసరమని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డ పద్మ అభిప్రాయపడ్డారు.
మహిళలపై అసభ్యకర ప్రవర్తనను మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని ఆమె చెప్పారు. గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య ఘటనపై కూడ ఆమె స్పందించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.