AP Rains Update:హై అలర్ట్... 24గంటల్లో ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు (వీడియో)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న 24గంటల్లో భారీ నుండి అతిబారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

AP Weather Report... Next 24 hours heavy rains in AP

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మరీముఖ్యంగా రాబోయే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు... ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల heavy rains కురిసే అవకాశం ఉందని తెలిపారు.  

వాయుగుండం గా మారిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపు(శుక్రవారం) ఉదయం ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

వాయుగుండం తీరందాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం వుంటుంది. అలాగే సముద్రం కూడా అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.కొస్తాంద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు.

వీడియో

భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల్లో ముందస్తుగానే నష్టనివారణ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.  

READ MORE  చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుదిపేసిన భారీ వర్షం: స్తంభించిన జనజీవనం, రూ.కోట్లలో నష్టం

ఇటీవల ఓ వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసాయి. దాదాపు రెండుమూడురోజులు ఆయా జిల్లాల్లో వర్షభీభత్సం కొనసాగింది. భారీ వర్షాలతో nellore, tirupathi నగరాలు నీటమునిగాయి. వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చెరువుల, జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో నిండుకుండల్లా మారాయి. 

తిరుమలలో కూడా భారీ వర్షం కురవడంతో వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏడుకొండలపైకి నడకమార్గంలో వెళ్లే దారి వర్షపునీటితో వాగును తలపించింది. అలాగే వర్షదాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రేణిగుంట విమానాశ్రయం, రుయా ఆసుపత్రి కూడా నీటమునిగాయి. 

READ MORE  Heavy Rains in AP: బాధితులకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం: సీఎం జగన్ నిర్ణయం

ఇక ఈ వర్షాలు, ఈదురుగాలుల దాటికి రైతులు  తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునగడం, ధాన్యం తడిసిపోవడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వర్షాల దాటికి ఇళ్లలోకి కూడా నీరుచేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ వర్షభీభత్సాన్ని మరిచిపోకముందే మరో వాయుగుండం ఏపీపై విరుచుకుపడేందుకు సిద్దమైంది. 

ఇటీవల వర్షభీభత్సం సందర్భంగా ఎదురయిన ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్  కె.కన్నబాబు ఈ భారీ వర్షసూచనపై స్పందించారు.తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని... రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios