ఈ రెండురోజులు(శుక్ర, శనివారాలు) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండురోజులు కోసాంద్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. రాయలసీమలో సాధారణం నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాతో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజామువరకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. గురువారం కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా సాధారణ వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాలు రెండురోజులపాటు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
read more విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...
మరో తెలుగురాష్ట్రం తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
కొద్దిరోజులు ముఖం చాటేసిన వర్షాల తిరిగి జోరందుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇకపై వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఆనందాన్ని నింపింది.
