Asianet News TeluguAsianet News Telugu

తీరందాటిన వాయుగుండం... దక్షిణాంధ్ర, రాయలసీమలో అతిభారీ, తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటిందని... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ap weather report... extremely heavy Rains possible in rayalaseema and west andhra
Author
Tirupati, First Published Nov 19, 2021, 9:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ వాయుగుండం తీరం దాటినట్లు వెల్లడించారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి  - చెన్నై సమీపంలో తీరం దాటింది. 

ఇవాళ ఉదయం 5.30 గంటల వరకు ఉత్తర tamilnadu మీదుగా chennai కి 60 కిలోమీటర్ల దక్షిణ నైరుతి దిశగా ఈ వాయుగుండం ఆవరించినట్లు తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఈ సాయంత్రానికి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అన్నారు. 

ఇక తీరందాటిన ఈ వాయుగుండం ప్రభావం దక్షిణాంధ్ర, రాయలసీమలలో పాటు ఉత్తర తమిళనాడు, కర్నాటక రాజధాని బెంగళూరు ప్రాంతాలమీద ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం west andhra, rayalaseema, karnataka capital bangalore ప్రాంతాలలో భారీనుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించారు. telangana తొ పాటు , పుtamilnadu, పుదుచ్చెరి, కర్నాటకలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  

వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు వీచాయని... సముద్రం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది కాబట్టి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

read more  ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. వరద నీటితో అతలాకుతలం అవుతున్న జిల్లాలు.. చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు..

శుక్రవారం కూడా భారీ నుండి extreme heavy rains కొనసాగే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. కుండపోత వర్షాలతో నీటమునిగిన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో NDRF, SDRF బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. వర్షప్రభావిత జిల్లాలలో లోతట్టుప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. అవసరం అయితేతప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు. 

ఇక గురువారం ఉదయం నుండి chittoor district లో వర్షభీభత్సం కొనసాగుతోంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఏకదాటిగా కురిసిన వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది.  రోడ్లపైకి మోకాల్లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. tirumala కు వెళ్లడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి తిరుపతికి చేరుకున్న భక్తులు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో చిక్కుకున్నారు.

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలెవైన తిరుమలలో పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. కొండపై భారీ వర్షం కురవడంతో వరదనీరు దిగువకు పోటెత్తుతోంది. ఈ నీటి ప్రవాహం కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంబవిస్తున్నాయి. అలాగే నడకమార్గంలో కూడా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో తిరుమల కొండపైకి వెళ్ళే అన్ని మార్గాలను (ఘాట్ రోడ్డు, నడకమార్గాలు) మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు.  

read more  Tirupati Rains: తిరుపతిలో కుండపోత...చెరువులను తలపిస్తున్న రోడ్లు, జలపాతంలా తిరుమల కొండ (వీడియో)

ఏడుకొండలపై కురిసిన వర్షం దిగువకు ప్రవహిస్తుండటంతో కపిలేశ్వర తీర్థం వద్ద జలపాతం ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఓ వ్యక్తి అదుపుతప్పి వరదనీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

ఇక శుక్రవారం కూడా భారీ వర్షాలు కునిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల  నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశ నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios