Asianet News TeluguAsianet News Telugu

ఏపీని కుదిపేస్తున్న వాలంటీర్ వార్.. పరస్పర విమర్శలతో హీటెక్కిన పాలిటిక్స్.. 

AP Volunteer: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వార్ మరింత ముదిరింది. వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకున్నదని వైసిపి ఆరోపిస్తుంటే.. లేదు లేదు వృద్ధులను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని ప్రతిపక్ష టీడీపీ, జనసేన విమర్శిస్తోంది.

AP Volunteer: Political War Between YCP and TDP Over Volunteer Issue in AP
Author
First Published Apr 3, 2024, 9:02 AM IST

AP Volunteer: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వార్ నడుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత  ముదురుతోంది. వాలంటీర్లు బలవంతంగా డేటా కలెక్ట్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో వాలంటీర్లతో నగదు పంపిణీ  చేయొద్దని,నగదు పంపిణీ పథకలు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు. ఇతర ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని  సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

ఈ పరిణామంలో వాలంటీర్ల వార్ ప్రారంభమైంది. వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకున్నదని వైసిపి ఆరోపిస్తుంటే..  వృద్ధులను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని ప్రతిపక్ష టీడీపీ, జనసేన విమర్శిస్తోంది. ఇంటి వద్ద పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి టిడిపి అధినేత ఫోన్ చేశాడు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు టెన్షన్లు పంపిణీ ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి వృద్ధులు ఇబ్బంది పడకుండా పంపిణీ చేయాలన్నారు

ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాణయ కామెంట్స్ హాట్ టాఫిక్ గా మారాయి. చేసిందంతా చేసి ఇప్పుడు టిడిపి నేతలు కబుర్లు చెబుతున్నారని, వ్రుధ్దులు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా చేసిన చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని, ఇందుకు వికలాంగులకు పెన్షనర్లకు ఏం సమాధానం చెబుతారని మంత్రి బొత్స నిలదీశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారనీ, కనీస మానవత్వం ఉండొద్దని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేండ్లుగా వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేస్తూంటే..  అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని నిలదీస్తున్నారు

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

మరోవైపు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కూడా రాజకీయంగా కీలకంగా మారింది. తాము ప్రజలకు సేవ చేస్తుంటే.. తమ నిందలు వేస్తున్నారని,  ప్రతిపక్ష నేతల తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నామంటున్నారు. పెన్షన్ ఇవ్వకుండా తమని అడ్డుకోవడం కలచివేసిందని చెప్పుకొస్తున్నారు. టెన్షన్ల కోసం వృద్ధులు ఫోను చేస్తున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము పంపిణీ చేసే పరిస్థితి లేదన్నారు. 

ఈ అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. వాలంటీర్లపై  టిడిపి .. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినందు వల్ల వారు రాజీనామాలు చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది. లేదు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను వైసీపీ తమ కార్యకర్తలుగా వాడుకుంటుందనీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తన స్వార్ధ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లలకు రాజీనామా ఫార్మాట్లు పంపించి, ఆ ఫార్మాట్ మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేయించారని,   ఈ అంశాన్ని ఎన్నికల్లో వాడుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని టిడిపి కౌంటర్ ఇస్తోంది. 

కీలక మార్గదర్శకాలు

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.  ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారిగా పెన్షన్ పంపిణీ చేయాలని పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వులు స్పష్టం చేసింది. ఈ తరుణంలో  దివ్యాంగులు, రోగులకు, వీల్ చెర్ కు పరిమితమైన వారికి ఇంటి దగ్గర పెన్షన్లు ఇవ్వాలని,   గ్రామ వార్డు, సచివాలయాల దగ్గర పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. అలాగే గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. మొత్తానికి పెన్షన్ల పంపిణీ విషయం మాత్రం.. అధికార, ప్రతిపక్ష నేతల పరస్పర విమర్శలతో ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios