AP SSC results: ఏపీ పదో తరగతి ఫలితాలు.. మీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
AP SSC results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 6,64,152 మంది విద్యార్థులు ఏపీ పది పరీక్షలు రాశారు. శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.
AP 10th Exam Result 2023: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) శనివారం ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ (పదో తరగతి) ఫలితాలను విడుదల చేయనుంది. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్ 'www.results.bse.ap.gov.in' నుంచి తెలుసుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 202-23 విద్యాసంవత్సరానికి గాను 6.5 లక్షల మంది విద్యార్థులు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారని బీఎస్ఈఏపీ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 26 వరకు రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది ఫలితాలను 28 రోజుల్లో విడుదల చేస్తే, ఇప్పుడు 18 రోజుల్లోనే ఫలితాలను ప్రకటిస్తున్నామనీ, ఇది రికార్డు అని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ, స్పాట్ వాల్యుయేషన్, ఫలితాల వెల్లడి విషయంలో తాము చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పారు. మరోవైపు ఉత్తీర్ణత శాతం తెలుసుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉపాధ్యాయుల ఆందోళనలు, కొవిడ్ ప్రభావం, ఇతర కారణాలతో గత ఏడాది (2022)లో ఏపీ పదో తరగతి ఫలితాల్లో డిజాస్టర్ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఫలితాలు చాలా తక్కువగా ఉండగా 6,15,908 మంది విద్యార్థులు హాజరుకాగా 67.26 శాతం ఉత్తీర్ణతతో 4,14,281 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 2019 ఫలితాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 27.62 తగ్గిందనీ, ఇది పదేళ్లలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం అని పేర్కొంది. 2019లో ఉత్తీర్ణత శాతం 94.88గా నమోదైంది. ఫలితాలు పడిపోవడానికి ప్రధాన కారణం కోవిడ్ మహమ్మారి అని ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఈ ఏడాది ఫలితాల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. ఆరు పేపర్లు ఉన్న సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని కూడా అనుసరించింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది విద్యార్థులకు 24 పరీక్షా పత్రాలతో కూడిన బుక్ లెట్ ను అందజేశారు. అవసరమైతే విద్యార్థులకు 12 పేజీల బుక్ లెట్ ను కూడా అందజేశారు. విద్యార్థులకు సమయం ఆదా చేసేందుకు ఈ ఏడాది బిట్ పేపర్లను కూడా ప్రశ్నపత్రంలో చేర్చారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే..?
- పదో తరగతి పరీక్ష ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.
- వెబ్ సైట్ హోమ్ పేజీలో మీకు ఏపీ పదో తరగతి ఫలితాలు అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇలా చేసిన తర్వాత మీకు ఫలితాలకు సంబంధించి పేపీ ఒపెన్ అవుతుంది.
- ఈ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్, అడిగిన ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
- సంబంధిత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
- కొన్ని క్షణాల్లో మీ పరీక్షల ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
- అక్కడే మీకు డౌన్ లోడ్ లేదా ఫ్రింట్ అనే అప్షన్ కనిస్తుంది. దీంతో మీరు మీ ఫలితాలను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.
లేదా డైరెక్టుగా ఈ రిజల్ట్ పేజీలోకి వెళ్లండి.. (ఫలితాలు వెలువడిన తర్వాత ఓపెన్ అవుతుంది): పది ఫలితాలు