సారాంశం
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి చెప్పారు. బాలురలో ఉత్తీర్ణ శాతం.. 69.27 శాతం, బాలికల్లో ఉత్తీర్ణత శాతం.. 75.38 శాతం ఉన్నట్టుగా తెలిపారు. ఉత్తీర్ణతలో పార్వతీపుర్వం మన్యం జిల్లా టాప్‌లో ఉందని.. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు.
గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉత్తీర్ణత 95.25 శాతంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు ఈ నెల 13 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ నెల 17లోపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలిపారు.
ఇక, విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 26 వరకు రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
>> పదో తరగతి పరీక్ష ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.
>> వెబ్ సైట్ హోమ్ పేజీలో మీకు ఏపీ పదో తరగతి ఫలితాలు అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయండి. ( లేదా డైరెక్టుగా ఇక్కడ క్లిక్ చేసి రిజల్ట్ పేజీలోకి వెళ్లండి..)
>> ఇలా చేసిన తర్వాత మీకు ఫలితాలకు సంబంధించి పేపీ ఒపెన్ అవుతుంది.
>> ఈ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్, అడిగిన ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
>> సంబంధిత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
>> కొన్ని క్షణాల్లో మీ పరీక్షల ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
>> అక్కడే మీకు డౌన్ లోడ్ లేదా ఫ్రింట్ అనే అప్షన్ కనిస్తుంది. దీంతో మీరు మీ ఫలితాలను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.