AP Skill Development Scam: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ..
Amaravati: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు చంద్రబాబును కలవనున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.
AP Skill Development Scam: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం నేడు (గురువారం) విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు లిస్ట్ అయింది. దీంతో చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. వీరందరూ ఒకేసారి చంద్రబాబును జైలులో కలవనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును బాలయ్య, పవన్, లోకేష్ లు కలవనున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు" సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు నేతలు ఉదయం 11:30 తర్వాత చంద్రబాబును కలవనున్నట్టు సమాచారం. ఆ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్తారని జనసేన వర్గాలు తెలిపాయి.