సారాంశం

ఆకాశరామన్న ఫిర్యాదు పై టిటిడి స్పందించడం భాధకరమన్నారు. నిధులు గోల్ మాల్ ఆరోపణలు రావడంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి చేత తాము విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో ఇదే అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్సై స్థాయి అధికారిని విచారణకు పంపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆరోపించారు. 
 

న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ప్రకాష్. న్యూఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయన టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 

ఢిల్లీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై టీటీడీ వైఖరిని నిర్వహిస్తూ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ప్రవీణ్ ప్రకాష్.  
ఆకాశరామన్న ఫిర్యాదు పై టిటిడి స్పందించడం భాధకరమన్నారు. 

నిధులు గోల్ మాల్ ఆరోపణలు రావడంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి చేత తాము విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో ఇదే అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్సై స్థాయి అధికారిని విచారణకు పంపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆరోపించారు. 

టీటీడీ వైఖరి ఎపి భవన్ విలువలను తగ్గించేలా ఉందన్నారు. అయినప్పటికీ ఆ అధికారికి తాము అంతా సహకరించినట్లు చెప్పుకొచ్చారు.నిధుల గోల్ మాల్, విచారణ జరుగుతన్న వ్యవహారంపై  టీటీడీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విచారణను ఆపలేదన్నారు. 

టీటీడీ వైఖరిని నిరసిస్తూ లోకల్ అడ్వైజరి కమిటి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కోరారు. చివరన గోవిందా అంటూ నామస్మరణం చేశారు.