Asianet News TeluguAsianet News Telugu

YCP Changed Incharges: వైసీపీ సంచలన నిర్ణయం.. 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జీల మార్పు..కొత్త అభ్యర్థులు వీళ్లే..

YSRCP: ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సోమవారం నాడు పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడగా.. అదే సమయంలో 11 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను మారుస్తూ వైసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.ఆ కొత్త అభ్యర్థులు వీళ్లే.. 

AP Politics YSRCP Changed 11 Constituencies In Charges KRJ  
Author
First Published Dec 12, 2023, 12:29 AM IST

YSRCP: ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సోమవారం నాడు ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడగా.. అదే సమయంలో 11 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను మారుస్తూ వైసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది. ఈ మేరకు  సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ప్రభావంతో వైసీపీ (YSRCP) అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.  అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  మాట్లాడుతూ.. 10 ఏళ్ళ నుండి ప్రజలకి జవాబు దారి పార్టిగా వైసీపీ ఉందనీ, కార్యకర్తల ఇష్టం మేరకు సీఎం నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం మార్పులు చేశామనీ, భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉంటాయని అన్నారు. సర్వేల ప్రకారం అభ్యర్థులను మార్చడం జరుగుతుందనీ,  గతంలోనే ఎమ్మెల్యే అందరికి చెప్పామని తెలిపారు.

అసంతృప్తిగా ఉంటే వారికి అర్ధం అయ్యేలా చెబుతామని, ఫైనల్ గా పార్టీ గెలుపు కోసం పని చేయాలని పేర్కొన్నారు. మళ్ళీ సీఎంగా జగన్ అవ్వాలనీ, లోతుగా అలోచించి,చర్చించి మార్పులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా గాలిలో మాటలు చెబుతున్నాయని, ఇంత వారికు ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. రిజ్వర్డ్ స్థానాలలో కూడా మార్పలు చేసాము వారికి కూడా అర్ధం అయ్యేలా చెబుతామనీ, కొత్త వారికి కూడా అవకాశం ఇస్తామని వివరణ ఇచ్చారు. 

అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. 11 మంది స్థానాలలో కొత్త వారికి ఇంచార్జ్ లను మార్చామని తెలిపారు. 

అభ్యర్థుల జాబితా: 

మంగళగిరి – గంజి చిరంజీవి

చిలకలూరిపేట – మల్లెల రాజేశ్ నాయుడు

గుంటూరు వెస్ట్ – విడదల రజిని

కొండేపి (ఎస్సీ) – ఆదిమూలపు సురేశ్

పత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్

అద్దంకి – పాణెం హనిమి రెడ్డి

తాడికొండ (ఎస్సీ) – మేకతోటి సుచరిత

వేమూరు (ఎస్సీ) – వరికూటి అశోక్ బాబు

సంతనూతలపాడు (ఎస్సీ) – మేరుగు నాగార్జున

రేపల్లె – ఈపూరి గణేశ్

గాజువాక – వరికూటి రామచంద్రరావు
 

Follow Us:
Download App:
  • android
  • ios