రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణంలోని గామన్ బ్రిడ్జిపై లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకొన్నారు.

లారీలో  నర్సీపట్నం నుండి తమిళనాడుకు తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.  నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో  గంజాయి సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో కూడ గంజాయి సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని గంజాయి సరఫరా సాగుతున్న విషయాన్ని ఏపీ పోలీసులు గుర్తించారు. కాలేజీ విద్యార్ధులకు సిగరెట్ల రూపంలో కూడ గంజాయిని సరఫరా చేస్తున్న విషయం కూడా గతంలో బయటకు వచ్చింది.

పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకొన్నా కూడ గంజాయి సరఫరా చేసే నిందితులు కొత్త కొత్త పద్దతుల్లో సరఫరా చేస్తున్నారు.  సులభమైన మార్గంలో డబ్బు సంపాదన కోసం కొందరు గంజాయి సరఫరాను ఎంచుకొన్న ఉదంతాలు చోటు చేసుకొన్నాయి.