Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రి టెన్షన్: నలుగురు ఎమ్మెల్సీలకు కమిషనర్ షాక్

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అపిషియో సభ్యులతో చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి టీడీపీ, వైసీపీలు ఎత్తులకు పైయెత్తులు వేస్తున్నాయి.

AP Municipal Elections: Four MLCs request for ex officio memberships rejected in Tadaipatri
Author
Tadipatri, First Published Mar 15, 2021, 11:57 AM IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడపత్రి మున్సిపాలిటీలో నలుగురు ఎమ్మెల్సీలకు షాక్ తగిలింది. తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవడానికి వారు పెట్టుకున్న దరఖాస్తులను కమిషనర్ తోసి పుచ్చారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా వారికి అర్హత లేదని కమిషనర్ స్పష్టం చేశారు. 

తాడిపత్రిలో అర్హత లేనందున వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు కమిషనర్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్సీల్లో ముగ్గురు వైసీపీకి చెందినవారు కాగా, మరొకరు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్  రానందున చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. 

తాడిపత్రి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. వీటిలో టీడీపీ 18 వార్జులను గెలుచుకుంది. వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. సిపిఐ ఒక చోట విజయం సాధించగా, మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 

మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్ -5 క్లాజ్ (3) ప్రాకరం పోలింగ్ తేదీ తర్వాత 30 రోజుల లోపు ఆనయ ఎక్కడో చోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. రంగయ్య తాడిపత్రిలో ఎక్స్ అఫిషిో సభ్యుడిగా పేరు నమోదు చేసుకుంటే వైసీపీ బలం కూడా 18కి పెరుగుతుంది. దీంతో టీడీపీ, వైసీపీ బలాలు సమానమవుతాయి. సిపిఐ అభ్యర్థి ఒక పార్టీకి, స్వతంత్ర అభ్యర్థి మరో పార్టీకి మద్దతు ఇచ్చినా బలాలు సమానవుతాయి. ఇద్దరు కూడా ఒకే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. ఇలా జరిగినా కూడా టాస్ వేయాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రహస్య ప్రాంతానికి తరలించారు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ఆయన ఎత్తులు వేస్తున్నారు. మొత్తం మీద, మైదుకూరు, తాడిపత్రి మున్సిపాలిటీల చైర్మన్ పదవుల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios