AP Municipal Elections 2021: నెల్లూరులో బాబుకి ఎదురుదెబ్బ, మున్వర్ రాజీనామా
ఎన్నికల వేళ నెల్లూరు మున్సిపాలిటీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్ TDPకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. Anil Kumar Yadav ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో TDPని దెబ్బ తీసే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
నీటి పారుదల శాఖ మంత్రి Anil Kumar Yadav సమక్షంలో Munwar తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వారిని అనిల్ కుమార్ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్యాప్తంగా కుానికి, జాతికి, మతానికి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, దానికి ఆకర్షితులై ప్రతిపక్షానికి చెందిన నాయకులు వైసీపీలోకి వస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ జాతీయాధ్యక్షుడు Chandrababu ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేసినా విజయం తమ వైసీపీదేనని ఆయన అన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలోని అన్ని డివిజన్లకు పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ాయన అన్నారు. 40 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను బలపరచడానికి మనుషులు కూడా లభించడం లేదని ఆయన అన్నారు. Nellore Municipality పరిధిలోని మొత్తం 54 డివిజన్లలో తాము విజయం సాధిస్తామని ఆయన చెప్పారు.
Also Read: అభ్యర్థులను నిలబెట్టే దిక్కేలేదు... మీరా మాకు పోటీ: టిడిపిపై మంత్రి అనిల్ ధ్వజం
కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సీపీఎంతో చర్చలు టీడీపీ చర్చలు ఫలించలేదని చెప్పారు. మరో వైపు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ నీచమైన చర్యలకు అంతకన్నా నిదర్శనాలు ఉండబోవని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
గతంలో ఆగిపోయిన మున్సిపాలిటీ వార్డులకు, జడ్పీటీసీ, ఎంపీటీ స్థానాలకు, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14,15,16 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు కూడా ముగిసింది. నెల్లూరు సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటు 533 గ్రామ పంచాయతీ వార్డులకు, 69 మంది సర్పంచులకు, 85 ఎంపీటీసులకు, 11 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు కార్పోరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పంచాయతీలకు సంబంధించి 14వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు ఈ నెల 15వ తేదీన పోలింగ్, 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈ నెల 1వ తేదీన పోలింగ్, 18వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.