సారాంశం

AP MLC Results: ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యయేట్స్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీలు పోటీ పడ్డాయి. తాజా ఫ‌లితాల్లో తూర్పు రాయలసీమ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్య‌ర్థి కంచర్ల శ్రీకాంత్‌ ఘనవిజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.
 

MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాల నేప‌థ్యంలో ప‌లు చోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైకాపా, టీడీపీ పార్టీల నాయ‌కులు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటూ కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద హీట్ ను పెంచారు. అయితే, ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటీ ప‌డ్డాయి. తాజా ఫ‌లితాల్లో తూర్పు రాయలసీమ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్య‌ర్థి కంచర్ల శ్రీకాంత్‌ ఘనవిజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

టీడీపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్య‌ర్థి కంచర్ల శ్రీకాంత్ ఘ‌న‌విజ‌యంతో కనిగిరి ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు నాయ‌కులు సంబరాలు బాణ‌సంచా కాలుస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత రాత్రి స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ నాయ‌కులు బాణసంచా కాల్చి, డాన్సులు చేస్తూ విజ‌య సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు జై కొడుతూ.. టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

కాగా, కంచర్ల శ్రీకాంత్ గెలుపుపై టీడీపీ స్పందిస్తూ.. "టీడీపీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ప్రభావమే అని ప్రజలు అంటున్నారు. జగన్ రెడ్డి భయపడినట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ గారి దెబ్బ వైసీపీకి గట్టిగానే తగిలిందన్నమాట" అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.