Asianet News TeluguAsianet News Telugu

ఏపీ గ్రాడ్యయేట్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు: జడ శ్రావణ్‌కుమార్‌

AP MLC Results: ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యయేట్స్  ఎమ్మెల్సీ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటీ పడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జ‌డ శ్రావ‌ణ్ కుమార్ స్పందిస్తూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

AP MLC Election Results 2023: Jada Shravankumar criticises YSRCP
Author
First Published Mar 17, 2023, 11:36 PM IST

MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యయేట్స్  ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జై భీమ్ భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్రావ‌ణ్ కుమార్ స్పందిస్తూ అధికార పార్టీ వైఎస్సార్సీసీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి  చెంపపెట్టు లాంటిదని అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో  వైఎస్సార్సీసీకి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యయేట్స్  ఎమ్మెల్సీ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండగా, పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైకాపాలు పోటీ పడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జ‌డ శ్రావ‌ణ్ కుమార్ స్పందిస్తూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏసీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. రానున్న మ‌రిన్ని ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

అధికార పార్టీ ఆగ‌డాల‌ను గుర్తించి.. వైకాపాకు వ్య‌తిరేకంగా ఓటు వేసిన వారికి జ‌డ శ్రావ‌ణ్  ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో ఉంద‌నీ, ఏపీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను ఛీ కొట్టారని చెప్పడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమంటూ పేర్కొన్నారు. ఓట‌ర్లు అధికార పార్టీకి దిమ్మ‌దిగిరే షాక్ ఇచ్చార‌ని చెప్పారు. రాష్ట్ర రాజ‌ధాని గురించి ప్ర‌స్తావిస్తూ అధికార పార్టీ వైకాపా.. మూడు రాజ‌ధానుల‌తో కాల‌యాప‌న చేస్తోంద‌నీ, ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. రానున్న రోజుల్లో రైతులు, వ్యాపారులు, ప్రజలు వైకాపాను ఛీ కొట్టి ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.

చేసిన త‌ప్పుల‌కు శిక్ష‌ను అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని పేర్కొంటూ ఎంపీ అవినాష్ రెడ్డి కేసును గురించి ప్ర‌స్తావించారు. అవినాష్ రెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార పార్టీతో పాటు దాని నాయ‌కుల‌కు చెంపపెట్టులాంటిద‌ని విమ‌ర్శించారు. జైభీమ్‌ భారత్‌ పార్టీ ప్ర‌యాణం గురించి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios