Asianet News TeluguAsianet News Telugu

AP MLC Elections: తలశిల రఘురామ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభినందనలు..

స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తలశిల రఘరామ్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (dharmana krishnadas) అభినందనలు తెలిపారు. విజయవాడ (Vijayawada) సమీపంలోని గొల్లపూడిలో  శనివారం రఘురామ్ ని కలసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు.
 

AP MLC Election deputy cm dharmana krishnadas congratulates ycp mlc Candidate talasila raghuram
Author
Vijayawada, First Published Nov 20, 2021, 12:18 PM IST

స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో.. సీఎం జగన్‌ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం‌మ్ (talasila raghuram) పేరును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తలశిల రఘరామ్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (dharmana krishnadas) అభినందనలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్..  ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా ఎంతో సమర్థవంతంగా తలశిల రఘురామ్ పార్టీ కోసం అహర్నిశలు పని చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకన్నారు. 

విజయవాడ (Vijayawada) సమీపంలోని గొల్లపూడిలో  శనివారం రఘురామ్ ని కలసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో తన అభిమానాన్ని చాటుకునేలా కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్ర పటాన్ని అందజేసి డిప్యూటీ సీఎంను రఘురాం ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. స్నేహశీలి, నిగర్వి, సౌమ్యుడు తలశిల రఘురామ్ అని అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మంచి పనితీరుతో రఘురామ్ ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు ప్రఖ్యతలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.   కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, ఆళ్ళ నాని, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరి జయరాం, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక, శనివారం తలశిల రఘరామ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

వారం రోజుల కిందటే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను (AP MLC Elections) వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తలశిల రఘురామ్ (కృష్ణా), వరుదు కల్యాణి(విశాఖ), వంశీకృష్ణ యాదవ్‌ (విశాఖ), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు), అనంత ఉదయ భాస్కర్‌ (తూర్పు గోదావరి), ఇందుకూరు రఘురాజు(విజయనగరం), మూరుగుడు హన్మంత రావు(గుంటూరు), అరుణ్‌కుమార్‌(కృష్ణా), తూమూటి మాధవరావు(ప్రకాశం), కృష్ణ రాఘం జయేంద్ర భరత్‌ (చిత్తూరు), వై. శివరామిరెడ్డి (అనంతపురం) వైసీపీ అభ్యర్థులని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. 

ఈ ఎన్నికలకు సంబంధించి.. ఈనెల 23 వ‌ర‌కు నామినేష‌న్లను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న అభ్యర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios