అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక మంత్రులు వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు. అలాగే నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి నారాయణ సైతం వెనుకంజలో ఉన్నారు. 

అటు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం వెనుకంజలో ఉన్నారు. అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. అచ్చెన్నాయుడుపై వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పోటీ చేశారు. 

ఇకపోతే నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. నారాయణపై వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. ఇకపోతే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుంటూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనపై ప్రస్తుత ఎమ్మెల్యే కాకాని గోర్థన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరంతా ఏపీ కేబినెట్ లో కీలక శాఖలో మంత్రులుగా పనిచేస్తున్నారు.