న్యూఢిల్లీ: 15రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర మంత్రి గజేందర్ షెకావత్  వస్తారని  ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ లు శుక్రవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

విభజన చట్టంలో పోలవరంపై తాగు నీటి అవసరాల అంశం కూడ ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కేంద్ర మంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని అనిల్ కుమార్ చెప్పారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై మంత్రులు షెకావత్ తో చర్చించారు. 2017లో జరిగిన పొరపాట్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టుగా  మంత్రులు తెలిపారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టుగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.